నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా మురళీ మనోహర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’ ఓటీటీలోకి రానుంది. వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్‌లు నిర్మాతలుగా వ్యవహరించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 19న థియేటర్లలో విడుదలై వినోదాత్మకంగా ఆకట్టుకున్న ఈ సినిమా, సంక్రాంతి కానుకగా జనవరి 16 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ‘జర భద్రం.. ఇది అంతా మోసం.. గుర్రం పాపిరెడ్డి వస్తున్నాడు’ అంటూ జీ5 ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది.




















