హైదరాబాద్: నగర ప్రజలకు ముఖ్య సమాచారం. ఈ నెల నవంబర్ 3 నుండి హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు అమల్లోకి రానున్నాయని మెట్రో యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
కొత్త షెడ్యూల్ ప్రకారం, మెట్రో రైళ్లు ఇకపై ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్ స్టేషన్లలో నడుస్తాయి. ఈ మార్పు నగర ప్రయాణికుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయమని అధికారులు తెలిపారు.
ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మెట్రో రైలు యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న మెట్రో వేళలు
- సోమవారం నుంచి శుక్రవారం: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11.45 వరకు
- శనివారం: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు
- ఆదివారం: ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు
కొత్త టైమ్‌టేబుల్‌తో, ప్రతిరోజు సమాన వేళల్లో సేవలు అందించడం వల్ల ప్రయాణికులకు మరింత సౌకర్యం లభించనుంది. ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకునేలా ఇది సహకరిస్తుందని అధికారులు పేర్కొన్నారు.




















