తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు అయిన సమయంలో, ఆయన క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ సినీ నిర్మాత బండ్ల గణేష్ గారు మొక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మొక్కును తీర్చుకొనేందుకు ఆయన షాద్‌నగర్ నుండి తిరుమల వెంకన్న క్షేత్రం వరకు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు చంద్రబాబు గారిపై ఉన్న అపారమైన అభిమానాన్ని చాటుకున్నారు. “భగవంతుడి సాక్షిగా చెబుతున్నా.. చంద్రన్న ప్రాణాలతో క్షేమంగా బయటకు రావాలని మొక్కుకున్నాను. ఆయనకు పదవి, అధికారం కంటే కూడా ఆయన ప్రాణాలే ముఖ్యం. ఆయన క్షేమంగా బయటకు వస్తే నా గడప నుంచి ఆయన గడప దాకా నడిచి వెళ్తానని మొక్కుకున్నాను” అని భావోద్వేగానికి లోనయ్యారు.


















