దానిమ్మ పండు అనేక పోషకాలను నిండి ఉంది.. దీన్ని తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు నిపుణులు. అయితే దానిమ్మ పండుతోనే కాదు.. ఆకులు, బెరడుతోనూ అనేక వ్యాధ్యులు దూరం అవుతాయి. ఈ ఆకు పసరు వాసన వస్తుంది. ఈ ఆకును ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతుంటారు. దానిమ్మ ఆకులతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఈరోజు మనం తెలుసుకుందాం..
ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్ని కుష్టు వ్యాధి, చర్మ రోగాల నివారణ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు. రోజుకు రెండు సార్లు ఈ ఆకులలో కషాయంగా చేసుకుని తాగడం వల్ల సీజనల్ దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని అంటున్నారు పోషకాహార నిపుణులు.
నిద్రలేమి సమస్య ఉన్నవారికి దివ్య ఔషధం దానిమ్మ ఆకుల. వీటితో చేసుకున్న పేస్ట్‌తో చేసిన కషాయం తాగితే సమస్య నుంచి ఉపశమనం లబిస్తుంది. దీని కోసం మూడు వంతుల నీటిలో దానిమ్మ ఆకుల పేస్ట్ కలిపి.. ఆ నీరు అర వంతు వచ్చే వరకూ మరిగించి తాగాలి. ఈ నీటిని రోజూ రాత్రి నిద్ర పోయేముందు తాగితే హాయిగా నిద్రపోతారు.
గజ్జి, తామర వంటి చర్మ సమస్యలకు కూడా ఈ ఆకులు ఉపయోగకరంగా ఉంటాయి. దానిమ్మ ఆకులతో చేసిన పేస్ట్‌ని గజ్జి, తామర అప్లై చేస్తే అవి త్వరగా నయం అవుతాయి. ఇవి మాత్రమే కాదు శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్న కూడా ఈ పేస్ట్‌ని అప్లై చేస్తే త్వరగా తగ్గుతాయి.
చెవి ఇన్ఫెక్షన్, చెవి నొప్పితో బాధపడేవారికి కూడా దానిమ్మ ఆకులు మేలు చేస్తాయి. దీని కోసం దానిమ్మ ఆకుల నుంచి రసం తీసుకొని దానిలో నువ్వుల నూనె లేదా ఆవ నూనె కలపాలి. ఆ మిశ్రమాన్ని రెండు చుక్కలు రెండు చెవుల్లో వేస్తుంటే చెవి నొప్పి, ఇన్‌ఫెక్షన్లు దూరం అవుతాయి.
అలాఫి నోటి సంబంధిత వ్యాధుల నుంచి కూడా ఈ ఆకులు వాడటం వల్ల ఉపశమనం లభిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్య, నోటిలో పుండ్లుకి దానిమ్మ ఆకుల రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఆకుల రసాన్ని నీటిలో కలిపి ఆ నీటితో పుక్కిలిస్తుండాలి. దీంతో నోటి సమస్యలన్నీ పోతాయి.





















