ఒక ట్రే గుడ్ల ధర ఇప్పుడు 35 లక్షల రియాల్స్‌కి చేరింది, గత వారం ఇది 22 లక్షల రియాల్స్ మాత్రమే ఉండింది. లీటరు వంట నూనె ధర 7.90 లక్షల రియాల్స్ నుంచి 18 లక్షల రియాల్స్‌కి పెరిగింది. కేవలం ఒక వారంలోనే నిత్యావసరాల ధరలు దాదాపు రెట్టింపు అయ్యాయి. నెలకోసం సరిపడా సామాను కొనుగోలు చేయాలంటే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకెళ్లాల్సి వస్తోంది. ఇరాన్‌లో పరిస్థితి ఇదే. ఆర్థిక సంక్షోభం కారణంగా ఇరాన్ కరెన్సీ తీవ్రమైన విలువ తగ్గుదలనికి గురైంది. నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో ప్రజలు రోడ్లపై నిరసనలకు వచ్చారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇరాన్ ప్రభుత్వం సబ్సిడీలకు బదులు నేరుగా ప్రజలకు డబ్బు అందిస్తోంది.




















