అమరావతిలో 15 ప్రధాన బ్యాంకుల కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ కూడా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే సీఆర్డీయే ఆధ్వర్యంలో అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం ప్రాంతాల్లో భూకేటాయింపులు పూర్తయ్యాయి. ఈ 15 బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నిర్మాణం ద్వారా సుమారు 6,541 ఉద్యోగాల అవకాశాలు కల్పించబడుతున్నాయి.























