కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగులు తమ పనితీరుపై నిరంతరం ఉన్నతాధికారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. “మన పని మన గురించి మాట్లాడుతుంది” అనే భావన సరైనది కాదు. ఉద్యోగులు తమ ఆలోచనలు, పనికి సంబంధించిన వివరాలు, కెరియర్ లక్ష్యాలను బృంద నాయకులతో పంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా తమ బలాలు, బలహీనతలు తెలుసుకుని నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు.
నిఖిల్ అనే సాఫ్ట్‌వేర్ డెవలపర్ తనకు అప్పగించిన పనులను సమర్థంగా పూర్తి చేసినా, తన కెరియర్ ఆశయాలను టీమ్ లీడర్‌తో పంచుకోలేదు. దీంతో అతని ప్రతిభ ఉన్నప్పటికీ పదోన్నతి గురించి యాజమాన్యం ఆలోచించలేదు. తర్వాత తన పొరపాటు గ్రహించిన నిఖిల్ టీమ్‌తో మాట్లాడి నిర్ణయాన్ని మార్చుకున్నాడు.అదే సంస్థలో పనిచేసిన అపర్ణ మాత్రం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన పనితీరుపై టీమ్ లీడర్‌తో చర్చించేది. ఎదురైన సమస్యలు, మెరుగుపర్చుకోవాల్సిన అంశాలు తెలుసుకునేది. ఈ అలవాటు ఆమె పనితీరును మెరుగుపరిచింది. చివరికి కఠినమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేసి, టీమ్ లీడర్‌గా పదోన్నతి పొందింది.
ఫీడ్‌బ్యాక్ కోరడం ద్వారా ఉద్యోగి నేర్చుకునే స్వభావం ఉన్న వ్యక్తిగా గుర్తింపు పొందుతాడు. మీరు అడగకపోతే మీ లక్ష్యాలు, అభివృద్ధి అవసరాలు ఇతరులకు తెలియవు. నేటి వేగవంతమైన కార్పొరేట్ ప్రపంచంలో మీ ఎదుగుదలకు మీరే బాధ్యత వహించాలి.అనిల్ అనే మార్కెటింగ్ అధికారి లక్ష్యాలు సాధించడంలో సమర్థుడైనా, కఠినమైన మాటతీరుతో సహోద్యోగుల నుంచి దూరమయ్యాడు. ఇతరుల సూచనలను పట్టించుకోకపోవడంతో పదోన్నతిని కోల్పోయాడు. తర్వాత తన తప్పును గ్రహించి ప్రవర్తన మార్చుకున్నాడు.
ఇంకో ఉదాహరణగా సుష్మిత. మంచి పనితీరు ఉన్నప్పటికీ సమావేశాల్లో తన ఆలోచనలను చెప్పకపోవడంతో నాయకత్వ లక్షణాలు కనిపించలేదని భావించారు. ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాత ఆమె చురుకుగా సమావేశాల్లో పాల్గొని తన ప్రతిభను చూపింది. దీంతో కొద్ది కాలంలోనే టీమ్ లీడర్‌గా ఎదిగింది.మొత్తానికి, ఫీడ్‌బ్యాక్ అనేది విమర్శ కాదు… అభివృద్ధికి దారి చూపే మార్గదర్శకం.
నిరంతరం అభిప్రాయం తీసుకుని మెరుగుపడే ఉద్యోగులకే కెరియర్‌లో నిజమైన ఎదుగుదల లభిస్తుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















