హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో పూర్తవుతోంది. చివరి రోజున ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు మరో సెట్ నామపత్రాలు సమర్పించనున్నారు. ఇప్పటివరకు మొత్తం 127 నామినేషన్లు స్వీకరించబడ్డాయి. ఈ రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ అగ్రనాయకులు కూడా పాల్గొననున్నారు.
నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22న జరగనుంది. ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 24. పోలింగ్ నవంబర్ 11న నిర్వహించగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు.



















