పశ్చిమ బెంగాల్ పర్యటనలో చోటుచేసుకున్న ప్రొటోకాల్ వైఫల్యంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తర బెంగాల్‌లో నిర్వహించాల్సిన అంతర్జాతీయ ఆదివాసీ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆమె తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన తనకు ముఖ్యమంత్రి లేదా మంత్రుల నుంచి అధికారిక స్వాగతం లభించలేదని పేర్కొన్నారు.
సిలిగుడిలో నిర్వహించిన 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సులో ప్రసంగించేందుకు రాష్ట్రపతి అక్కడికి వెళ్లారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతిని ముఖ్యమంత్రి లేదా ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు స్వాగతించాల్సి ఉంటుంది. అయితే ఈ పర్యటనలో ప్రభుత్వం తరఫున ఎవరూ అధికారికంగా స్వాగతించడానికి రాకపోవడం వివాదానికి దారితీసింది.
అదే సమయంలో తాను ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన ఆదివాసీ సదస్సుకు అనుమతి నిరాకరించడమే కాకుండా, కార్యక్రమం జరిగే ప్రదేశానికి ప్రజల ప్రవేశాన్ని కూడా నిరోధించారని రాష్ట్రపతి పేర్కొన్నారు.అయితే ఈ పరిణామాలపై తనకు రాష్ట్ర ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఎలాంటి ద్వేషం లేదని ద్రౌపదీ ముర్ము స్పష్టం చేశారు. మమతా బెనర్జీ తనకు సోదరితో సమానమని పేర్కొంటూ, వివాదాన్ని పెద్దదిగా చేయాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews


















