అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొత్త న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ హైకోర్టు ముఖ్య న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆయనకు ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ హైకోర్టులో రెండో స్థానంలో కొనసాగనున్నారు. ఆయన నియామకంతో హైకోర్టు న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కానుందని న్యాయవర్గాలు అభిప్రాయపడ్డాయి.



















