న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ కేంద్ర న్యాయశాఖకు అధికారికంగా సిఫారసు చేశారు. జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
అనుభవజ్ఞుడైన న్యాయవేత్తగా జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పులతో గుర్తింపు పొందారు. భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన నవంబర్ 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ నియామకంతో సుప్రీంకోర్టు వ్యవహారాలు కొత్త దశలోకి ప్రవేశించనున్నాయని న్యాయవర్గాలు భావిస్తున్నాయి.


















