ఈరోజు (12-05-2026)
సర్వ సౌఖ్యాలు, మానసిక ప్రశాంతత లభించే అద్భుతమైన సమయం. సంపదతో పాటు సామాజిక గౌరవం కూడా వరిస్తుంది. ప్రత్యర్థులపై విజయం సాధించే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయదిశగా సాగుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామి సేవ విశేష శుభఫలితాలను అందిస్తుంది.
ఈవారం (10-05-2026 నుండి 16-05-2026 వరకు)
ఏకాగ్రత, పట్టుదలతో పనిచేస్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. ఆర్థిక సంబంధ ప్రయత్నాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. స్థిరాస్తి, గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో శుభపరిణామాలు కనిపించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు పొందగలరు. వ్యాపారంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా, శ్రద్ధగా ముందుకు సాగితే సమస్యలు క్రమంగా తగ్గుతాయి. ఇతరులతో సున్నితంగా, ఆలోచించి మాట్లాడడం మేలు చేస్తుంది. నవగ్రహ శ్లోకాల పఠనం శుభఫలితాలను అందిస్తుంది.




















