కార్తిక మాసం సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రుద్రాభిషేకంతో కూడిన ఈ పూజల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల ఫోటోలను మంత్రి లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం ‘ఎక్స్’లో షేర్ చేశారు.
‘రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని, ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సుఖసంతోషాలు నెలకొనాలని మనసారా ప్రార్థించాం’ అని లోకేశ్ పేర్కొన్నారు. పరమశివుడి అనుగ్రహం తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్టు బ్రాహ్మణి తన పోస్టులో తెలిపారు.



















