ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం – 15వ అధ్యాయము

November 5, 2025
in Devotional News
0
కార్తీక పురాణం - 15వ అధ్యాయము
Share on FacebookShare on TwitterShare on Whatsapp

దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట
అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని – జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను. ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును. శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపమునుంచవలెను.ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు. సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీకమాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనముజేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభమునుండి చేయు చుండెను.

      ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను.  అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.  ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచిచూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడియుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని.  కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషిక జన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు.
      నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తినుబండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమనుభవించుచుంతివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ము డవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది.  కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

పంచదశాధ్యాయము – పదిహేనోరోజు పారాయణము సమాప్తము.

ShareTweetSend
Previous Post

100 కోడిగుడ్లు తగిలించుకున్న అక్షయ్‌ కుమార్‌!

Next Post

మహిళల జట్టు విజయాన్ని 1983 ప్రపంచకప్‌తో పోల్చాల్సిన అవసరం లేదు: సునీల్ గావస్కర్‌

Related Posts

భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం
Devotional News

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం
Devotional News

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

March 11, 2026
తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్రకు భారత్ గౌరవ్ రైలు
Devotional News

తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్రకు భారత్ గౌరవ్ రైలు

March 11, 2026
తిరుమల చేరి స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్
Devotional News

తిరుమల చేరి స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్

March 11, 2026
శ్రీవారి ఆశీస్సులు పొందిన ‘బ్యాండ్ మేళం’ టీమ్
Devotional News

శ్రీవారి ఆశీస్సులు పొందిన ‘బ్యాండ్ మేళం’ టీమ్

March 11, 2026
పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి
Devotional News

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

March 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

March 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.