తిరుమల శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కొత్త నిర్ణయం తీసుకుంది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి బంగారు, వెండి డాలర్లను దేశవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి తితిదే సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు తిరుమలలో మాత్రమే ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్న ఈ డాలర్లు త్వరలోనే ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు.
తితిదే ఆదాయం పెంపు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైనాన్స్ కమిటీ ఇటీవల ఈ ప్రతిపాదనను పరిశీలించి, శ్రీవారి డాలర్ల విక్రయాలను విస్తరించాలని సిఫార్సు చేసింది. ప్రస్తుతం విక్రయిస్తున్న బంగారు, వెండి పెండెంట్లు, డాలర్లతో పాటు అదనంగా బంగారు, వెండి నాణేలను కూడా ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
భక్తులు ఆన్‌లైన్ ద్వారా ఈ డాలర్లను కొనుగోలు చేస్తే, వాటిని తపాలా శాఖ ద్వారా భద్రతా ఏర్పాట్లతో పంపించేలా చర్యలు తీసుకుంటున్నారు. ట్రాన్సిట్ సమయంలో భద్రత కోసం ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పించాలని నిర్ణయించారు. అంతేకాకుండా డాలర్ల డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేలా తితిదే అధికారులు ఆలోచనలు చేస్తున్నారు.
ప్రస్తుతం బంగారం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో భక్తులకు అందుబాటులో ఉండేలా బంగారు పూతతో వెండి డాలర్లను కూడా విక్రయించాలనే ప్రతిపాదనకు తితిదే ధర్మకర్తల మండలి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే భక్తులు శ్రీవారి బంగారు, వెండి డాలర్లను ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేసే అవకాశం లభించనుంది.ఈ నిర్ణయంతో దేశంలోని ఎక్కడ ఉన్నా భక్తులు శ్రీవారి పవిత్ర డాలర్లను పొందే అవకాశం కలగనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews


















