ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

కార్తీక పురాణం 13వ అధ్యాయం

November 2, 2025
in Devotional News
0
కార్తీక పురాణం 13వ అధ్యాయం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

కన్యాదాన ఫలం
ఓ జనక చక్రవర్తీ! కార్తీకమాసములో యింకను విధిగా చేయవలసిన ధర్మములు చాలాయున్నవి. వాటిని వివరించెదను. సావధానుడవై ఆలకింపుము. కార్తీకమాసములో నదీస్నానం ముఖ్యము. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనము చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింప శక్యము కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరచినను ఫలము కలుగును. ఈవిధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసినయెడల యెంతటి మహాపాపములు చేసియున్ననూ, యెంతటి దుష్కృత్యములు చేసియున్ననూ, యెంతటి వ్యభిచారం చేసియున్ననూ, అ పాపములన్నియూ పోవును. ఎన్ని నూతులూ, తటాకములూ త్రవ్వించిననూ పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనము జేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్న ముఖ్యమైనది కన్యాదానము. కార్తీకమాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానము చేసినయెడల తను తరించుటయేగాక తన పితృదేవతలను కూడ తరింప జేసిన వాడగును. ఇందుల కొక యితిహాసం గలదు. చెప్పెదను శ్రద్ధగా ఆలకింపుము.
సువీర చరిత్రము:
ద్వాపరయుగములో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన “సువీరు” డను ఒక రాజుండెను. అతనికి రూపవతి యను భార్యకలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడయి, భార్యతో అరణ్యమునకు పారిపోయి ధన హీనుడయి నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలము గడుపుచుండెను. కొన్ని రోజుల కాతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాబముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహరాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రునివలె దినదినాభివృద్ధి నొందుచు, అతి గారాబముతో పెరుగుచుండెను. ఆమె చూచువారలకు కనులపండువుగా, ముద్దు లొలుకు మాటలతో చాలా ముచ్చటగా నుండెను. దినములు గడచినకొలదీ, బాలికకు నిండు యౌవన దశ వచ్చెను. ఒకదినము వనప్రస్థుని కుమారుడా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకా రాజు “ఓ ముని పుత్రా! ప్రస్తుతము నేను కడు బీదస్థితిలో నున్నాను. అష్ట దరిద్రములు అనుభవించు చున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన యెడల నాకుమారై నిచ్చి పెండ్లి చేతు” నని చెప్పగా తన చేతిలో రాగి పైసా యైననూ లేక పోవుటచే బాలికపై నున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఘోర తపమాచరించి, కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి, తనకుమారైను మునికుమారునికిచ్చి పెండ్లిచేసి నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపెను.అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖ మనుభవించు చుండెను.
సువీరుడు ముని కుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్చగా ఖర్చుపెట్టుచూ భార్యతో సుఖంగా వుండెను. అటుల కొంతకాలము జరిగిన తర్వాత ఆరాజు భార్యామణి మరొక బాలికను కనెను. అ బిడ్డకు కూడా యుక్త వయస్సురాగానే మరల యెవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో యెదురు చూచుచుండెను. ఒకానొక సాధుపుంగవుడు తపతీనదీ తీరమునుండి నర్మదానదీ తీరమునకు స్నానార్ధమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని “ఓయీ! నెవెవ్వడవు? నీముఖ వర్చస్సుచూడ రాజవంశము నందు జన్మించినవానివలె నున్నావు. నీవీ యరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి?” అని ప్రశ్నించగా, సువీరుడు “మహానుభావా! నేను వంగదేశము నేలు చుండెడి సువీరుడను రాజును.

        నా రాజ్యమును శత్రువు లాక్రమించుటచే భార్యా సమేతముగా నీ యడవిలో నివసించు చున్నాను. దరిద్రము కంటె కష్టమేదియునూ లేదు. పుత్ర శోకము కంటె గొప్ప దుఃఖము లేదు. అటులనే భార్యా వియోగము కంటే గొప్పసంతాపము మరొకటిలేదు. అందుచే రాజ్య భ్రష్ఠుడనియు నందున యీ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను.  నాకు యిద్దరు కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి, వాని వద్ద కొంతధనము పుచ్చుకొంటిని. దానితోనే యింతవరకు కాలక్షేపము చేయుచున్నాను" అని చెప్పగా, "ఓ రాజా! నీవు యెంతటి దరిద్రుడవైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్యనమ్ముకొంటివి. కన్యావిక్రయము మహాపాతకములలో నొకటి, కన్యను విక్రయించినవారు "అసిపత్ర వన" మను నరక మనుభవింతురు.   ఆద్రవ్యముతో దేవముని, పితృదేవతా ప్రిత్యర్ధము యే వ్రతము చేసినను వారు నశింతురు. అదియునుగాక కన్య విక్రయము చేసిన వారికి పితృ దేవతలు పుత్ర సంతతి కలుగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమగుటయేగాక అతడు మహానరకమనుభవించును.  కన్యావిక్రయము జేసినవారికి యెట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే యున్నారు. కావున, రాబోయే కార్తీకమాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తికొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు, ధర్మబుద్ధిగలవానికి కన్యాదానము చేయుము.  అటులచేసిన యెడల గంగాస్నానమొనరించిన ఫలము, అశ్వమేధ యాగము చేసిన ఫలమును పొందుటయేగాక, మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగి పోవును" అని రాజునకు హితోపదేశము చేయగా అందుకా రాజు చిరునవ్వు నవ్వి

“ఓ మునివర్యా! దేహ సుఖము కంటె దాన ధర్మముల వలన వచ్చిన ఫలము యెక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను సిరి సంపదలతోను సుఖముగా వుండక, చనిపోయిన తర్వాత వచ్చెడి యేదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జార విడువమంటారా? ధనము, బంగారము కలవారే ప్రస్తుతము లోకములో రాణింప గలరుకాని ముక్కు మూసుకొని, నోరు మూసుకొని, బక్కచిక్కి శల్యమై యున్న వారిని లోకము గుర్తిస్తుందా? గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు, కాన, నా రెండవ కుమర్తెను కూడా నేనడిగినంత ధనమెవరిత్తురో వారికే యిచ్చి పెండ్లి చేయుదును కాని, కన్యా దానము మాత్రము చేయను” అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొనిపోయి, యమలోకములో అసిపత్రవన మను నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరుని పూర్వీకుడైన శ్రుతకీర్తి యను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యావిక్రయము వలన ఆ శ్రుతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకొని వచ్చిరి. అంతట శ్రుతకీర్తి “నేనెరిగున్నంతవరకును యితరులకు ఉపకారమును చేసి దానధర్మాదులు, యజ్ఞయాగాదు లొనరించి యున్నాను. నాకీ దుర్గతి యేల కలిగె?” నని మనము నందనుకొని నిండుకొలువు దీరియున్న యమధర్మరాజు కడకేగి, నమస్కరించి “ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి.

        ప్రాణకోటి నంతను సమంగా జూచుచుందువు. నేనెన్నడూ ఏ పాపమూ చేసి యుండలేదు. నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడ్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు" అని ప్రాధేయ పడెను. అంత యమధర్మరాజు శ్రుతకీర్తిని గాంచి, 'శ్రుతకీర్తీ! నీవు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు, నీ వెటువంటి దురాచారములూ చేసియుండలేదు.  అయిననేమి? నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ట పుత్రికను ధనమునకాశించి అమ్ముకొనెను. కన్య నమ్ముకొనేవారి పూర్వీకులు యిటు మూడు తరాలవారు అటు మూడు తరాల వారున్నూ వా రెంతటి పుణ్యా పురుషులైననూ నరక మనుభవించుటయే గాక, నీచ జన్మ లెత్తవలసి యుండును. నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగుదును గాన, నీకొక ఉపాయము చెప్పెదను.  నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీతీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా యాశీర్వాదమువలన నీవు మానవ శరీరము దాల్చి, అచటకు పొయి ఆ కన్యను వేదపండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీకమసమున సాలంకృతముగా కన్యాదానము చేయించుము.  అటుల చేసిన యెడల నీవు, నీ పూర్వీకులు, సువీరుడు, మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు. కార్తీకమాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానము లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను,లేక విధివిధానముగా ఆబోతునకు వివాహ మొనర్చినను కన్యాదానఫలమబ్బును.కనుక, నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మకార్యమువలన నీ పితృగణము తరింతురు. పొయి రమ్ము" అని పలికెను.  శ్రుతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను, కుమార్తెను చూచి సంతోషపడి, ఆమెతో యావత్తు విషయములు వివరించి,   కార్తీకమాసమున సువీరుని రెండవ కుమారైను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక బ్రాహ్మణ యువకునికిచ్చి అతివైభవంగా వివాహము చేసెను. అటుల కన్యాదానము చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గ లోకములో నున్న పితృ దేవతలను కలిసి కొనెను.  కన్యా దానము వలన మహా పాపములు కూడా నాశన మగును. వివాహ విషయములో ఎవరికి మాట సహాయము చేసినను, పుణ్యము కలుగును. కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్షబూని అచరించినవాడు విష్ణుసాన్నిధ్యము పొందును. శక్తి కలిగియుండి ఉదాసీనత చూపు వాడు శాశ్వత నరకమున కేగును.

త్రయోదశాధ్యాయము సమాప్తము.

ShareTweetSend
Previous Post

ఈ వరుడు నిజంగా చాలా స్పీడ్‌గా ఉన్నాడుగా! కెమెరామెన్‌కే ఏం షాక్ ఇచ్చాడో చూడండి!

Next Post

మహిళా టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ బహుమతి – వన్డే ప్రపంచకప్‌ విజేతలకు రూ.51 కోట్ల నజరానా!

Related Posts

భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం
Devotional News

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం
Devotional News

భక్తులకు గుడ్ న్యూస్.. ఆన్‌లైన్‌లో శ్రీవారి డాలర్ల విక్రయం

March 11, 2026
తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్రకు భారత్ గౌరవ్ రైలు
Devotional News

తమిళనాడు పుణ్యక్షేత్రాల యాత్రకు భారత్ గౌరవ్ రైలు

March 11, 2026
తిరుమల చేరి స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్
Devotional News

తిరుమల చేరి స్వామివారిని దర్శించుకున్న బండ్ల గణేష్

March 11, 2026
శ్రీవారి ఆశీస్సులు పొందిన ‘బ్యాండ్ మేళం’ టీమ్
Devotional News

శ్రీవారి ఆశీస్సులు పొందిన ‘బ్యాండ్ మేళం’ టీమ్

March 11, 2026
పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి
Devotional News

పంచారామాల యాత్ర – పాపక్షయం, మోక్షం కలిగించే పవిత్ర అనుభూతి

March 10, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 11, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

పంచాంగం (11 మార్చి 2026, బుధవారం)

March 11, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
ప్రభుత్వ తెలుగు టీచర్‌ కావాలా? తెలుసుకోండి సరైన మార్గం

తెలుగు టీచర్‌ ఉద్యోగం కోసం ఎలా సిద్ధం కావాలి?

March 11, 2026
ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

ఎమ్మెస్సీ మ్యాథ్స్ విద్యార్థులకు గేట్‌ గొప్ప అవకాశం

March 11, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
భావనారాయణ స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం

పెదగంజాంలో భక్తి వైభవం… శ్రీరామపట్టాభిషేక మహోత్సవం

March 11, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.