హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడిన తర్వాత, తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత ఫేస్బుక్లో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. “కర్మ హిట్స్ బ్యాక్” అని ఆమె ట్వీట్ చేశారు.
ఈ రోజు విడుదలైన ఫలితాల ప్రకారం, జూబ్లీహిల్స్‌లో భారత రాష్ట్ర సమితి ఓటమి చవి చూసింది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 98,988 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు, భాజపా అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డికి 17,061 ఓట్లు పోసాయి.




















