సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ‘దృశ్యం 3’ (Drishyam 3) ఒకటి. ఇప్పటికే విడుదలైన రెండు భాగాలు పలు భాషల్లో ఘన విజయాన్ని సాధించడంతో, మూడో భాగంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్ర హిందీ వెర్షన్ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో, అభిషేక్ పాఠక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోందని టీమ్ వెల్లడించింది. వచ్చే ఏడాది అక్టోబర్ 2న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వీడియో ద్వారా తెలియజేశారు. మరోవైపు, మలయాళం వెర్షన్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. త్వరలోనే ఆ వెర్షన్ విడుదల తేదీ కూడా ప్రకటించే అవకాశముంది.




















