ప్రఖ్యాత కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ షేర్లు సోమవారం స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టిన ఈ షేర్లు ప్రారంభంలో నిరాశ కలిగించాయి. ఇష్యూ ధర రూ.402 గా ఉండగా, ఎన్‌ఎస్‌ఈలో రూ.7 తగ్గింపుతో రూ.395 వద్ద, బీఎస్‌ఈలో రూ.12 తగ్గింపుతో రూ.390 వద్ద షేర్లు లిస్ట్ అయ్యాయి.
లెన్స్‌కార్ట్ ₹7,278 కోట్ల నిధులను సమీకరించడంలో భాగంగా 9.97 కోట్ల షేర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. IPOకి మొత్తం 281 కోట్ల షేర్లకు బిడ్‌లు దాఖలు అయ్యాయి. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్ (QIB) కోటా 40.35 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యింది, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు 18.23 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యారు. రిటైల్ పోర్షన్ 7.54 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందింది. IPOలో ఒక్కో షేరు ధర రూ.382–402 గా నిర్ణయించబడింది.
ఇప్పటికే, లెన్స్‌కార్ట్ డిసెంబర్ చివరికి AI ఆధారిత స్మార్ట్ కళ్లద్దాలను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
సీఈవో ఎమోషనల్ పోస్టు:
లిస్టింగ్ రోజు, లెన్స్‌కార్ట్ సీఈవో పీయూష్ బన్సల్ ఒక ఎమోషనల్ పోస్టు షేర్ చేశారు. “లెన్స్‌కార్ట్ దలాల్ స్ట్రీట్‌లో గంట మోగించనుంది. ఇది ముగింపు కాదు, కొత్త అధ్యాయం ప్రారంభం మాత్రమే. మేం భారత్‌ను ఈ ప్రయాణంలో భాగం చేయాలనుకుంటున్నాం. మీరు లెన్స్‌కార్ట్ కళ్లద్దాలు ధరించినప్పుడు ఒక సెల్ఫీ తీసి, విజన్‍ఫర్‌బిలియన్ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయండి” అని ఆయన పేర్కొన్నారు.
తన బృందానికి, వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. IPO చుట్టూ నెలకొన్న హైప్ కారణంగా గూగుల్‌లో లెన్స్‌కార్ట్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.




















