దర్శకధీరుడు రాజమౌళి సినిమాలకే కాదు, వాటిని ప్రజల ముందుకు తీసుకెళ్లే తన వినూత్నమైన శైలికీ ప్రసిద్ధి చెందారు. ఆయన చిత్రాల నుంచి ఎప్పుడైనా అప్‌డేట్ వస్తుందంటే, దాన్ని ఎలా కొత్తగా, ఆసక్తికరంగా ప్రజల్లోకి తీసుకువస్తారో అందరి చూపు ఆయనపై నిలుస్తుంది. ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ పేరుతో గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. మహేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టులో రాజమౌళి ఈ చిత్ర అప్‌డేట్‌ను ఈ నెలలో విడుదల చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ఇదే అంశంపై తాజాగా మహేశ్ ఎక్స్ వేదికలో రాజమౌళిని సరదాగా “అప్‌డేట్ ఎప్పుడు ఇస్తారు?” అని ప్రశ్నించగా, రాజమౌళి తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. వారి ఈ ఫన్నీ ట్వీట్ వార్‌లోకి ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చేరడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇలా సరదా ట్వీట్లతో ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ ప్రమోషన్‌కు శుభారంభం లభించినట్లు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.




















