ఈరోజు (01-11-2025)
దూరదృష్టితో ముందుగానే ప్రణాళికలు రూపొందిస్తారు. పెద్దల సూచనలు మీకు ప్రయోజనకరంగా మారుతాయి. ఆర్థిక ఒత్తిడులు తగ్గి, రుణ సమస్యలు సర్దుమణుగుతాయి. కొత్త అవకాశాల పట్ల ఆశావహ దృక్పథం ఏర్పడుతుంది. ఇష్టదేవతారాధన శుభఫలితాలను అందిస్తుంది.
ఈ వారం (26-10-2025 – 01-11-2025)
ఉన్నత స్థాయికి ఎదగడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. పెద్దల నుంచి ప్రశంసలు, ఆశీర్వాదాలు లభిస్తాయి. గౌరవం, ప్రతిష్ఠ మరింతగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉండి సంతోషాన్ని ఇస్తుంది. వ్యాపారంలో లాభదాయకమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో ఆనందభరితమైన క్షణాలు గడుపుతారు. శ్రీ లక్ష్మీ దేవి ధ్యానం శుభఫలితాలను అందిస్తుంది.



















