ఈ సందర్భంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… టెక్నాలజీ కోసం మాత్రమే కాకుండా… ఇంధన వ్యవస్థల రక్షణ కోసం CECRC ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీ 160 గిగావాట్ల గ్రీన్ విద్యుత్ ఉత్పత్తి దిశగా భారీ పెట్టుబడులు వస్తున్నాయని వివరించారు. ఈ సమయంలో విద్యుత్ వ్యవస్థల సెక్యూరిటీ చాలా ముఖ్యమని మంత్రి గొట్టిపాటి అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎండీ జేరేమీ జర్గన్స్ మాట్లాడుతూ… ఏఐ ట్రాన్సిషన్ సమయంలో ఇంధన వ్యవస్థల భద్రత అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పారు. ఏపీలో ఇంధన భద్రత, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవటం అభినందనీయమని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి, ఇంధన భద్రత విషయంలో భారత్‌లో వేగంగా నిర్ణయాలు జరుగుతున్నాయని… ఇలాంటి సమయంలో వ్యవస్థల రక్షణ అత్యంత కీలకమైన అంశమని వివరించారు. సామాజికంగా, ఆర్ధికంగా స్వావలంబన సాధించాలంటే ఈ తరహా కేంద్రాలు అవసరమవుతాయని జేరేమీ సూచించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ విజయానంద్ పాల్గొన్నారు.



















