ఈరోజు (13-01-2026)
ఉద్యోగంలో పనులను వాయిదా వేయకుండా వెంటనే పూర్తి చేయాలి. ఉత్సాహంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ముందుచూపుతో వ్యవహరించడం అవసరం. ఒక సంఘటన వల్ల కొంతకాలం మనోబలం తగ్గే అవకాశం ఉంది. రెచ్చగొట్టే వారు ఉండవచ్చు కాబట్టి విచక్షణా జ్ఞానంతో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి. నవగ్రహ ధ్యానం శుభఫలితాలను ఇస్తుంది.
ఈ వారం (11-01-2026 – 17-01-2026)
ఉద్యోగ రంగంలో అనుకూలమైన కాలం కొనసాగుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ప్రతి ప్రయత్నం ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపారంలో స్వయంకృషి అవసరం. ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం అయినప్పటికీ, పరిస్థితి క్రమంగా మెరుగవుతుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మనసుకు ఉపశమనాన్ని, శాంతిని ఇస్తాయి.




















