అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త, స్వరకర్త, కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాస 538వ జయంతి ఉత్సవాల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, కళ్యాణదుర్గం పట్టణం, హిందూపురం రోడ్ బైపాస్ సర్కిల్‌లో స్థానిక ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నేతృత్వంలో ఏర్పాటుచేసిన 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు. అలాగే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. బైపాస్ సర్కిల్‌కి శ్రీ భక్త కనకదాస సర్కిల్ అని నామకరణం చేశారు.
అంతకుముందు, బైపాస్ సర్కిల్‌కి వేలాది మంది మహిళలు, స్థానిక ప్రజలతో కలిసి మంత్రి నారా లోకేష్ ర్యాలీగా చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, ఎస్. సవిత, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీ నారాయణ, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, కందికుంట వెంకట ప్రసాద్, గుమ్మనూరు జయరాం, దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్, బండారు శ్రావణిశ్రీ, మరియు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్త కనకదాస వేడుకల్లో పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

























