కాకినాడ కలెక్టరేట్‌లో మంత్రి నారాయణ తుఫాన్ ప్రభావం మరియు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుఫాన్ ప్రత్యేకాధికారి కృష్ణతేజ, కలెక్టర్ షన్మోహన్‌తో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి నారాయణ తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైన రక్షణ చర్యలను వెంటనే అమలు చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, తుపాన్ సమయంలో విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ వ్యవస్థల్లో అంతరాయం రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.




















