‘మొంథా’ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులు, కలెక్టర్లతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్లు, ప్రత్యేక అధికారులు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితులను సమీక్షించారు.
హోంమంత్రి అనిత మాట్లాడుతూ, తుఫాన్ కాకినాడ తీరానికి దగ్గరగా దాటే అవకాశం ఉన్నందున అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని ఆరు మండలాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.
ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైనన్ని రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాలని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని హోంమంత్రి సూచించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని, ప్రజలు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.




















