మహిళల కోసం సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా నారా భువనేశ్వరి గారు ప్రయాణించారు. ఆధార్ కార్డు చూపించి బస్సులో ఎక్కి ఈ సేవను స్వయంగా అనుభవించిన ఆమె, కుప్పం పర్యటనలో భాగంగా శాంతిపురం నివాసం నుంచి తుమ్మిసి జలహారతి వరకు బస్సులో ప్రయాణం చేశారు. మహిళలతో మాట్లాడి, ఉచిత బస్సు సేవపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లో ఉంది.




























