కుప్పం పర్యటనలో భాగంగా నడింపల్లి గ్రామ మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కోలాటం ఆడి ఆనందాన్ని పంచుకున్నారు. కార్యక్రమంలో భువనేశ్వరి గారు తమిళ్ భాషలో మాట్లాడడం మహిళలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. అనంతరం గ్రామంలో ఉన్న గంగమ్మ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించడంతో పాటు, వారి సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కారం కోసం విశ్రాంతి లేకుండా పనిచేస్తామని భరోసా ఇచ్చారు.




























