భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ కొత్త ఆధార్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా మీ ఆధార్ వివరాలను స్మార్ట్‌గా ఫోన్లో భద్రపరచి, అవసరమైతే ఇతరులతో సులభంగా పంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, ఐఫోన్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చని ఉడాయ్ వెల్లడించింది. ఈ యాప్ ద్వారా పేపర్‌లెస్ అనుభవం పొందవచ్చు.
ఇప్పటివరకు ఎంఆధార్ యాప్ అందుబాటులో ఉన్నప్పటికీ, కొత్త యాప్ కేవలం ఆధార్ వివరాలను భద్రపరచడం, ఇతరులతో పంచుకోవడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. ఇందులో డిజిటల్ కార్డు డౌన్లోడ్, పీవీసీ కార్డు ఆర్డర్, ఇ-మెయిల్ లేదా మొబైల్ నంబర్ వెరిఫికేషన్, వర్చువల్ ఐడీ జనరేషన్ వంటి ఫీచర్లు ఉండవు.
కొత్త యాప్‌లో ముఖ్య ఫీచర్లు:
- ఆధార్ కార్డును ఎల్లప్పుడూ వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా డిజిటల్‌గా భద్రపరచుకోవచ్చు.
- కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను ఒకే డివైజ్‌లో ఉంచుకోవచ్చు.
- ఫేస్ అథెంటికేషన్ ఫీచర్ ఉంది.
- వివరాలను పంచుకునేటప్పుడు కావాల్సిన వివరాలను మాత్రమే ఎంచుకోవచ్చు.
- ఆధార్ బయోమెట్రిక్ డేటాను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు.
- ఆధార్ వివరాలను చివరిసారిగా ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు.
ఎలా వాడాలి:
- గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్ నుంచి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోండి.
- యాప్ అవసరమైన అనుమతులు అందించండి.
- టర్మ్స్ అండ్ కండీషన్స్‌ను అంగీకరించండి.
- ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మొబైల్ నంబర్ వెరిఫికేషన్ తర్వాత ఫేస్ అథెంటికేషన్ పూర్తి చేయండి.
- వివరాలు నమోదు చేసిన తరువాత సెక్యూరిటీ కోసం పిన్ సెట్ చేయండి. ఆపై యాప్‌ను సులభంగా ఉపయోగించవచ్చు.




















