పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, జీఎస్టీ తగ్గింపు కారణంగా ఒక్కో రైతు కుటుంబానికి ₹25,000 నుంచి ₹40,000 వరకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. అలాగే, వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని చెప్పారు.
వీటికి తోడు, సూపర్ సిక్స్ హామీలను ఏడాది కాలంలో అమలు చేశామని, రైతులకు అన్నదాత సుఖీభవం కింద మొదటి విడతగా రూ.7,000 జమ చేసినట్లు, గత ప్రభుత్వానికి బకాయిగా ఉన్న రూ.1,640 కోట్ల ధాన్యం చెల్లించామని, ధాన్యం అమ్మిన 48 గంటల్లోనే నగదు అందినట్లు పేర్కొన్నారు.
నిమ్మల రామానాయుడు, జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ శాఖను మోసం చేసి, మార్కెట్ కమిటీలను నిర్వీర్యం చేశారని విమర్శించారు.



















