హైదరాబాద్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2025–26 విద్యా సంవత్సరం కోసం మెడికల్ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: అక్టోబర్ 2 ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: అక్టోబర్ 8, 2025
అర్హతలు:
- NEET PG 2025లో అర్హత సాధించిన ఇన్ సర్వీస్ (ప్రభుత్వ వైద్యులు), నాన్ సర్వీస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
- తెలంగాణలో MBBS మొదటి సంవత్సరం నుంచి ఫైనల్ ఇయర్ వరకు చదివినవారు లేదా పునర్విభజన చట్టం ప్రకారం విజయవాడ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో MBBS పూర్తి చేసిన తెలంగాణ స్థానికులు మాత్రమే కన్వీనర్ కోటాలో అర్హులు.
- ఇంటర్ వరకు తెలంగాణలో చదివినా, MBBSని ఇతర రాష్ట్రం/విదేశాల్లో పూర్తి చేసినవారు తెలంగాణ స్టేట్ కోటా సీట్లకు అర్హులు కారు.
సీట్ల వివరాలు:
- 2024–25లో రాష్ట్రంలో 2,548 పీజీ మెడికల్ సీట్లు అందుబాటులో ఉన్నాయి.
- ఈ ఏడాది కొన్ని కళాశాలల్లో సీట్ల సంఖ్య పెరిగే అవకాశం.
- యూనివర్సిటీ విడుదల చేసే తుది సీట్ల మ్యాట్రిక్స్ ఆధారంగా:
- 50% సీట్లు ఆల్ ఇండియా కోటా (AIQ) కింద కేటాయింపు
- 50% సీట్లు తెలంగాణ రాష్ట్ర కోటా కింద స్థానిక విద్యార్థులకు లభ్యం
ప్రవేశ ప్రక్రియలో రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని KNRUHS రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. పూర్తి సమాచారం యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో లభ్యం.



















