నిజానికి సప్తమి తిధి, శ్రవణ నక్షత్రం సోమవారం పూట కలిసి వస్తే ఆరోజు కోటి సోమవారం అంటారు. అలావస్తే అనంత కోటి ఫలితము.
🙏ఈసారి అష్టమి , శ్రవణం నక్షత్రము కలిసినది
ఇలా కార్తీక మాసంలో కలిసి వస్తే సోమవారంతో సంభంధం లేకుండా ఆచారంగా కోటి సోమవరం చేస్తున్నాము.
👉శ్రవణా నక్షత్రము,గురువారం పూట కార్తీక మాసంలో వస్తే ఆరోజు కోటిసోమవారం అంటారు.
ఏకోటి సోమవారం రోజు ఉపవాసం చేస్తే కోటి సోమవారాల ఉపవాస ఫలితం దక్కుతుంది.
🙏సోమ అంటే చంద్రుడు అనిఅర్ధము స+ ఉమ = ఉమా సహితుడు అని అర్ధము కూడావస్తుంది.
శివునికి ప్రీతికరమైన రోజుఈరోజు
సోమవారానికి అధిపతి చంద్రుడు
చంద్రుడు కర్కాటక రాశికి చెందినవాడు.
👉🏿 చంద్రుడు తల్లికి, జలం, పూలు, సముద్రం, నదులు, ముఖము, ఉదరం, మహిళా సంఘాలకు, స్త్రీ సంక్షేమ సంఘాలకు చండ్రుడు కారకత్వం వహిస్తాడు.
👉 వృత్తి సంబంధంగా నౌకా వ్యాపారం, ఓడ రేవులు, వంతెనలు, ఆనకట్టలు, చేపల పెంపకం, వెండి, ముత్యములకు కారకత్వం వహిస్తాడు.
👉🏿 వ్యాధులలో రక్త హీనత, అతి మూత్రం, గర్భ సంబంధిత వ్యాధులు, బేదులు, మానసిక వ్యాధులు, ఉదర సంబంధిత వ్యాధులు, కేన్సర్ మొదలైన వాటికి కారకుడు.
👉చంద్రుడు బీజాలకు కారకుడు
అందుకే యజ్ఞయాగలో అంకురారోపణము చేస్తారు.
🌙చంద్రుడికి 27 మంది భార్యలు కలరు వారే అశ్వని,భరణి,కృత్తిక 27 నక్షత్రాలు చంద్రుని భార్యలు.
👉శివాలయనికి ఎక్కువగా సోమవారం వెల్తుంటారు.శివుడికి సోమేశ్వరుడు అనేపేరు కలదు.
👉🏿 గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్రానికి దగ్గరలో సోమనాథ్ దేవాలయాన్ని చంద్రుడు నిర్మించాడు. సోముడు అనగా చంద్రుడు అని అర్ధం. చంద్రుడిని దక్షుడి శాపం నుండి విముక్తిడిని చేసిన శివుడి ఆలయం కనుక ఇది సోమనాధ ఆలయం.
👉 ఇక్కడి శివుడు సోమనాధుడు అయ్యాడు. శివుడు ఈ ఆలయంలో చంద్రుడి తపః ఫలంగా స్వయంగా ప్రత్యక్షమై స్వయంగా వెలిసాడు.
👉🏿శివ పురాణము ప్రకారం ఆదివారం శివారాధనకు చాలా మంచిది. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.అయితే సోమవారం సౌమ్యప్రదోషంగా శివుని ఆరాధించడం విశేష ఫలప్రథమని పురాణాది శాస్త్రాల వచనం.
స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు.
దీని ప్రకారం సోమవారం ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరాధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు.
👉ఈ నియమముతో 16 సోమవారాలు వ్రతము చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.
👉ఈ కోటి సోమవారంనాడు ఉపవాసం ఉండి భగవంతుని పూజించి దానధర్మలు చేసినవారికి పాపాల నుంచి విముక్తి లభించడమే కాకుండా మోక్షం లభిస్తుందని అంటారు.
🔱ఈరోజు శివాలయాల్లో ప్రదోష కాలంలో అవునేతితో దీపారాధన చేసి నేను క్రింద తెలిపిన ప్రదోష స్తోత్రాన్ని 3 సార్లు దీపారాధన దగ్గర చదవండి.కోటి సోమవారం యొక్క సంపూర్ణ ఫలితము దక్కుతుంది.
👉🏿 అలాగే సోమగాయత్రి మంత్రాన్ని 27 సార్లు చదువుతూ శివాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయండి.
ఎలాంటి మానసిక సమస్యలు ఉన్నా వెంటనే పోతాయి.
👉🏿 ఇది ఈరోజు చేసే అద్భుత మైన రేమిడి
👉🏿 సోమగాయత్రి – ఓం క్షీర పుత్రాయ విద్మహే అమృతతత్త్వాయ ధీమహి తన్నోశ్చంద్ర ప్రచోదయాత్.
🌙ఈరోజుచంద్రుడికి ప్రీతికరమైన తెల్లనిరవిక,11 పిడికెట్లు బియ్యము11 తెల్లని పుష్పములు శివ దీక్ష పరునకు & దేవాలయ అర్చకులు కు దానంగా ఇవ్వండీ.
🌞ప్రదోష స్తోత్రమ్
జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత 💐
జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత 💐
జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద 💐
జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ 💐
జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ 💐
జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర 💐
జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ 💐
జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన 💐
జయ నాథ కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన 💐
జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో 💐
ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః 💐
సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర 💐
మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్యచ 💐
మహాశోకనివిష్టస్య మహారోగాతురస్యచ💐
ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః 💐
గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర💐
దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ 💐
అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ 💐
దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః 💐
మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర 💐
శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః 💐
నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః 💐
దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే 💐
సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః💐
ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్
బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్
సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ 💐
శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా
ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్



















