చోరీ కేసులో ఐదుగురు అంతర్రాష్ట్ర దొంగలను చిలకలపూడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 318 గ్రాముల బంగారు ఆభరణాలు రికవరీ చేయగా, వివరాలను డీఎస్పీ రాజా మీడియాకు వెల్లడించారు. చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత అక్టోబర్లో నమోదైన చోరీ కేసును టెక్నికల్ టీమ్ సాయంతో నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. ఈ నిందితులు కృష్ణా జిల్లాతో పాటు నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. అనేక కేసులలో కోల్పోయిన 318 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన పోలీసులను డీఎస్పీ రాజా ప్రశంసించారు.




















