ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు మంత్రులు అంగరంగ వైభవంగా స్వాగతం పలికారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రధాని పాల్గొననున్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న అనంతరం హిల్ వ్యూ స్టేడియానికి వెళ్లనున్నారు. బాబా జీవితం, బోధనలు, సేవలకు స్మారకంగా రూపొందించిన రూ.100 నాణెం మరియు నాలుగు తపాలా బిళ్లలను మోదీ ఆవిష్కరించనున్నారు.




















