ఇంటర్నెట్ డెస్క్: శ్రీనందు (Shree Nandu) హీరోగా నటించడంతో పాటు నిర్మిస్తున్న చిత్రం ‘సైక్ సిద్ధార్థ’ (Psych Siddhartha) కు వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటిస్తున్నారు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని లవ్‌సాంగ్‌ను విడుదల చేశారు. ‘ధుమ్ తకుమ్..’ అంటూ సాగిన ఈ పాటకు కాశర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, జెస్సీ గిఫ్ట్ గానం చేశారు.





















