కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ జనవరి 9న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మలేసియాలో జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ చరిత్ర సృష్టించింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజయ్ అభిమానులు కలిసి 85 వేల మందికి పైగా హాజరయ్యారు. భారతదేశం వెలుపల జరిగిన తమిళ సినిమా ఆడియో లాంచ్‌కు ఇంత భారీ హాజరు ఇదే తొలిసారి కావడంతో ఈ కార్యక్రమం మలేసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.ఈ ఈవెంట్‌లో భావోద్వేగానికి గురైన విజయ్ సినిమాలకు వీడ్కోలు ప్రకటించారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.




















