ShivaSakthi News
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు
ShivaSakthi News
No Result
View All Result
ShivaSakthi News
No Result
View All Result
  • హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రైమ్
  • కథలు
  • బిజినెస్‌
  • సినిమా
  • బంగారం – వెండి
  • స్టాక్ మార్కెట్
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • టెక్నాలజీ
  • భక్తి
  • రాశి ఫలాలు
  • చదువు

వనరులే ఏపీ బలం

October 1, 2025
in Andhra Pradesh News, Politics News
0
వనరులే ఏపీ బలం
Share on FacebookShare on TwitterShare on Whatsapp

ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి, మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఇక్కడి పరిస్థితులు అనుకూలం. స్థిరమైన నాయకత్వం, సమర్థ పారిశ్రామిక విధానాలతో చేయూతనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా చేసుకోవడానికి ముందుకు రావాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా మంగళవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు ఏపీలో ఆరుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించామని, ఇప్పుడు ఏడోసారి నిర్వహించబోతున్నామని చెప్పారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్‌ అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను అర్థం చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి క్రమం తప్పకుండా దావోస్‌ వెళ్లే ఏకైక రాజకీయ నాయకుణ్ని తానే అని చెప్పారు. 

‘ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్‌ నిర్మిస్తున్నాం. రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపు చేరేలా విమానాశ్రయాలు కడుతున్నాం. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో నంబర్‌ 1గా నిలిచిన మేం ఇప్పుడు గేర్‌ మార్చి స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాన్ని అనుసరిస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే సంపద సృష్టించాలన్న సిద్ధాంతాన్ని నేను బలంగా  నమ్ముతాను. అప్పుడే ఆదాయం పెంచుకొని, పేదరిక నిర్మూలన చేయగలం. 2024-25లో మేం 8.25% వృద్ధిరేటు సాధించాం. ఇప్పుడు 15% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014-19 మధ్యకాలంలో వృద్ధి రేటు సాధనలో నంబర్‌ 1గా నిలిచాం. 13.55% సీఏజీఆర్‌ సాధించాం. గత 15 నెలల్లో మేం 21 ప్రత్యేక పారిశ్రామిక విధానాలు విడుదల చేశాం. ఏపీని 2047నాటికల్లా 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఇప్పటి వరకు పీపీపీ విధానాన్ని అనుసరించిన మేం ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి కోసం పీ4 విధానాన్ని తీసుకొచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో స్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఏరోస్పేస్‌ సిటీలు నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్వాంటమ్‌ మిషన్‌ కింద 2026 జనవరిలో దేశంలో తొలి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ను అమరావతిలో మొదలుపెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌ తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. లక్ష్మీమిత్తల్‌ త్వరలోనే రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయబోతున్నారు. బీపీసీఎల్‌ రూ.లక్ష కోట్లతో పెట్రో కెమికల్స్‌ రిఫైనరీ ఏర్పాటు చేయబోతోంది. గూగుల్‌ అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో నెలకొల్పుతోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృతావకాశాలు ఉంటాయి. ఒకసారి మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మీకు మేం తుది దాకా చేయూతనందిస్తాం.

కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తతో సీఎం చంద్రబాబు కరచాలనం

అభివృద్ధిలో అగ్రస్థానం కోసమే మా పోటీ

వేగంగా పారిశ్రామికాభివృద్ధితో ముందుకెళుతున్న ఏకైక దేశం ఇండియా. అందులో పోటీపడుతున్న 5, 6 రాష్ట్రాల్లో ఏపీ నంబర్‌ 1గా ఉంటుంది. సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన ట్రాక్‌ రికార్డు మాకుంది. దానివల్ల ఇప్పుడు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం సాధించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఇప్పుడు దేవుడు నాకు మరో నగరం అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చాడు. అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన హరితనగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మేం సిద్ధం. అమరావతిలో జలవనరులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కరోజులోనే అక్కడ 70 టీఎంసీల మంచినీరు సముద్రంలోకి వెళ్లింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ కృష్ణా, గోదావరిల నుంచి 5వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దాన్నిబట్టి రాష్ట్రంలో జలవనరులు ఎంత పెద్దఎత్తున అందుబాటులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నాం

పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన నిర్ణయం వల్ల ఐటీ రంగం విస్తృతమై తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులైతే.. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారు. దేశంలో ఎవరూ సాహసించని సమయంలో విద్యుత్తు రంగ సంస్కరణలు తీసుకొచ్చిన అనుభవం మాకుంది. అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొచ్చాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఏ సంస్కరణలనైనా తక్షణం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దానివల్ల పెట్టుబడులను సాధించి భారత్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. అందువల్ల నవంబర్‌ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా. నేను ఇక్కడ కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే పిలవడం లేదు. ఆలోచనలు పంచుకొని, నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకొని, పరస్పరం అర్థం చేసుకోవాలి. అవసరమైనచోట కలిసి పనిచేయాలన్నదే మా లక్ష్యం. ఆ దిశగా పని చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు. 

కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తలనుద్దేశించి మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌

మూడు పారిశ్రామిక స్మార్ట్‌సిటీలున్న ఏకైక రాష్ట్రం ఏపీ: పీయూష్‌ గోయల్‌

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం, కావాల్సినన్ని వనరులున్నాయన్నారు. ‘మా అన్నయ్య చంద్రబాబు సంస్కరణలు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ల నిజమైన రూపకర్త. ఆయన ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి శ్రమిస్తున్నారు. 7వసారి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఏపీ ఆతిథ్యమివ్వడం చంద్రబాబు ప్రగతిశీల వైఖరికి నిదర్శనం. 1998లోనే హైదరాబాద్‌కు హైటెక్‌సిటీని పరిచయం చేశారు. ఇప్పుడు దేశంలోనే అధునాతన రాజధానిని నిర్మిస్తున్నారు. మూడు (కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిల్లో) ప్లగ్‌ అండ్‌ ప్లే ఇండస్ట్రియల్‌ స్మార్ట్‌ సిటీలు రాబోతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌’ అని చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. భారత్‌లో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించి కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ సంధానకర్తగా వ్యవహరించారు.

ShareTweetSend
Previous Post

చేస్తున్న మంచి చెబితే ప్రజలు మన వెంటే

Next Post

మెడికల్‌ పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల!

Related Posts

రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం..కోట్ల రూపాయల నష్టం!
Crime News

రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం..కోట్ల రూపాయల నష్టం!

March 12, 2026
45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ
Andhra Pradesh News

45°C దాటిన ఉష్ణోగ్రతలు … హీట్‌వేవ్ అలర్ట్ జారీ

March 12, 2026
ప్రజల ఆరోగ్య భద్రతకు ‘సంజీవని’… కొత్త పథకం ప్రారంభం
Andhra Pradesh News

75 లక్షల మందికి లబ్ధి.. ఏపీలో హెల్త్ రెవల్యూషన్!

March 11, 2026
ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు
Andhra Pradesh News

ప్రతి కలెక్టర్ నెలకు 8 రోజులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరి: సీఎం చంద్రబాబు

March 11, 2026
విజయ డెయిరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పష్టత
Andhra Pradesh News

విజయ డెయిరీ వివాదంపై మంత్రి నారా లోకేష్ స్పష్టత

March 11, 2026
సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష
Andhra Pradesh News

సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్ష

March 11, 2026
Next Post
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

I agree to the Terms & Conditions and Privacy Policy.

Live Cricket Score

Live Cricket Scores

Career

  • Trending
  • Comments
  • Latest
meenam

రాశి ఫలాలు – మీనం

March 12, 2026
రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

రేపు శని త్రయోదశి , శని త్రయోదశి నాడు ఏమి చేస్తే శనీశ్వర దేవుడు సంతృప్తి చెందుతాడు ?

October 3, 2025
దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

దక్షిణ కొరియాలో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన

October 2, 2025
పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

పంచాంగం: 12 మార్చి 2026 (గురువారం)

March 12, 2026
కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్

కొత్త మలుపులతో మరింత రసవత్తరంగా మారుతున్న మాస్టర్‌చెఫ్.

0
బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు

బంగ్లాదేశ్ జైలు నుంచి విడుదలైన భారత మత్స్యకారులు.. వారిలో 9 మంది విశాఖవాసులు.

0
మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

మహారాష్ట్రలో విషాదం.. అజిత్ పవార్ ప్రయాణించిన విమానానికి ప్రమాదం

0
ఏపీపీఎస్సీ గ్రూప్‌–2 తుది ఎంపిక జాబితా విడుదల.. 891 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక.

APPSC గ్రూప్–2 తుది ఎంపిక జాబితా విడుదల | 891 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు

0
హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

March 12, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

March 12, 2026
ఈరోజు బంగారం - వెండి ధరలు (12-03-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు (12-03-2026)

March 12, 2026

Recent News

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

March 12, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

మహిళల ఆరోగ్యానికి ఓట్స్‌, నట్స్‌ లడ్డూలు మంచి ఎంపిక

March 12, 2026
ఈరోజు బంగారం - వెండి ధరలు (12-03-2026)

ఈరోజు బంగారం – వెండి ధరలు (12-03-2026)

March 12, 2026
ShivaSakthi.Net

Stay updated with the latest Telugu news, breaking stories, and trending updates from across Andhra Pradesh, Telangana, and the world. A one-stop platform for politics, cinema, business, sports, and more

Follow Us

Browse by Category

  • Andhra Pradesh News
  • Blog
  • Business News
  • Career
  • Crime News
  • Devotional News
  • Education
  • Entertainment News
  • Gold and Silver News
  • Health
  • India News
  • Lifestyle
  • Movies
  • News
  • Politics News
  • Rasi Phalalu
  • Recipes
  • Sports News
  • Stock Market News
  • Technology News
  • Telangana News
  • Telugu Stories
  • World News

Recent News

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

హైదరాబాద్ హాస్టళ్లలో గ్యాస్ సంక్షోభం… కట్టెల పొయ్యిలపై వంటలు

March 12, 2026
లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

లోబీపీ లక్షణాలు ఏమిటి? ఎలా నియంత్రించాలి?

March 12, 2026
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 ShivaSakthi.Net

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result

© 2025 ShivaSakthi.Net

This website uses cookies. By continuing to use this website you are giving consent to cookies being used. Visit our Privacy and Cookie Policy.