దీపావళి
ఉదయం
సూర్యోదయానికి ముందు : ఆరోగ్యం సహకరించిన వారు తలారా స్నానం చేయాలి.
ఇంటి ముందు
సూర్యోదయ సమయానికి అనుకూలత, అవకాశం, ఆరోగ్యం ఉన్నవారు కళ్లాపు చల్లాలి లేదా గొబ్బెమ్మలను చేసి ఇంటి ముందు ఉంచాలి. అవకాశం లేని వారు అమ్మను స్మరించుకొని యథాశక్తి పూజ చేయవచ్చు
చేయవలసిన పూజ
లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పూజ చేయాలి లేదా శ్రీ సూక్తం తో పూజ చేయాలి. అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమార్చన చేయాలి దాని వల్ల స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, కుటుంబం అభివృద్ధి చెందుతుంది,జలానికి లోటు ఉండదు
వినవలసిన కథలు
లక్ష్మీ కథలు
నైవేద్యం
పులిహోర, దధ్యన్నం, పాయసాన్నం (పాలు,బియ్యంతో వండిన అన్నము)
పూజా విధానం
లక్ష్మీ మూర్తి గాని, విగ్రహం గాని పెట్టాలి. దీపం వెలిగించాలి.
పసుపు గణపతి లేదా గణపతి మూర్తిని పెట్టి పూజచేయాలి.
అమ్మవారికి పూజలో ఈ రోజు మన దగ్గర ఉన్న ఆభరణాలు సమర్పించాలి.
నీ సంపద నీకే సమర్శిస్తున్నా అని ఉదయం పూజలో పెట్టి సాయంత్రం పూజ అయిన తర్వాత ధరించాలి
పూజ అయ్యాక నాలుగు ప్రదక్షిణములు చేయాలి
గురు దర్శనం, పాద సేవ చేసుకోవాలి
అన్నింటి కంటే మనస్సు ముఖ్యం.
పుష్పాలు
తామర, ఎఱ్ఱని పుష్మాలు, ఎఱ్ఱకలువ (ఏవీ అందుబాటులో లేకపోతే మనస్సును సమర్శించండి)




















