‘ఛాంపియన్’గా ప్రేక్షకుల ముందు రోషన్ ప్రత్యక్షమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్ నిర్మాణం చేశారు. అనస్వర రాజన్ కథానాయికగా, నందమూరి కల్యాణ్ చక్రవర్తి ముఖ్య పాత్రల్లో నటించారు. సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ నేపథ్యంలో, నటి సమంత ఈ చిత్రంలోని ‘‘కమ్ కమ్ ఛాంపియన్… లెట్స్ డ్యాన్స్ ఛాంపియన్’’ అనే గీతాన్ని విడుదల చేశారు.




















