భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణంలో కీలకమైన అడుగు పడబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తొలి విమానం ల్యాండింగ్‌కు ముహూర్తం ఖరారైందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు. ట్రయల్ రన్ తేదీ జనవరి 4న భోగాపురం విమానాశ్రయ రన్ వే పై మొదటి ప్రయోగాత్మక విమానం (Trial Flight) దిగనుంది. ముఖ్య అతిథులు ఈ తొలి విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దిల్లీ నుంచి నేరుగా భోగాపురం చేరుకుంటారు. వారితో పాటు ఎంపీ కలిశెట్టి కూడా ఉండనున్నారు. ప్రాజెక్టు పూర్తి: ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నాయని, జూన్ నాటికి విమానాశ్రయ నిర్మాణ పనులన్నీ పూర్తవుతాయని ఎంపీ తెలిపారు. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.



















