కావాల్సిన పదార్థాలు:
- సగ్గుబియ్యం – 1 కప్పు
- పంచదార – 3 టేబుల్ స్పూన్లు
- మిల్క్ పౌడర్ – ¾ కప్పు
- పాలు – ½ లీటరు
- కండెన్స్‌డ్ మిల్క్ – 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి – ¼ చెంచా
- బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు – గుప్పెడు (అన్నీ కలిపి)
తయారుచేసే విధానం:
- ముందుగా సగ్గుబియ్యాన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగి, పావుగంట పాటు నానబెట్టండి.
- నానబెట్టిన సగ్గుబియ్యం నుండి నీటిని తీసేసి, దానికి పంచదార, మిల్క్ పౌడర్ కలిపి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయండి.
- ఈ మిశ్రమంతో చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి.
- పాలను బాగా మరిగించి, అవి చిక్కగా మారేవరకు ఉడికించండి.
- తరువాత, సగ్గుబియ్యం ఉండలు, కండెన్స్‌డ్ మిల్క్, యాలకుల పొడి వేసి ఐదు నుండి ఆరు నిమిషాలు ఉడికించండి.
- స్టవ్ కట్టేసి, బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులతో అలంకరించండి.
- అంతే, రుచికరమైన తియ్యటి ‘సాగో మలై’ సిద్ధం! దీనిని చల్లగా ఆస్వాదించండి.




















