కామారెడ్డి జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న యూనివర్సిటీ సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. హోలీ వేడుకలు ముగిసిన తర్వాత సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగి రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగినట్లు సమాచారం.
ఘర్షణలో కొంతమంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. సంఘటన విషయం తెలుసుకున్న యూనివర్సిటీ సిబ్బంది వెంటనే గాయపడిన విద్యార్థులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి సాధారణంగా ఉన్నట్లు తెలిసింది.
ఘటన సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు హాస్టల్‌కు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. భిక్కనూరు ఎస్సై ఆంజనేయులు, వసతిగృహ వార్డెన్ డాక్టర్ యాలాద్రి విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఘటనకు కారణమైన అంశాలపై విచారణ చేపట్టామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో యూనివర్సిటీ క్యాంపస్‌లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా క్యాంపస్‌లో భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని యూనివర్సిటీ అధికారులు భావిస్తున్నారు.
Amaravati Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APGovernment APNews APPolitics Breaking news BreakingNews BusinessNews Chandrababu naidu ChandrababuNaidu CrimeNews Entertainment Geopolitics Government India IndiaNews LawAndOrder Movies Naralokesh News news24 newsalert NewsToday NewsUpdate NewsUpdates PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews Tdp Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood Toofan TrendingNow WorldNews



















