సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ విడుదలైంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఆకట్టుకుంటోంది. ‘చూస్తా ఉండండి.. మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది’ అనే డైలాగ్‌తో ఆమె ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమాయకమైన లుక్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల్లో తనదైన స్టైల్‌ను సమంత ప్రదర్శించింది. 1980ల నేపథ్యంలోని క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.




















