కొత్త ఆరంభాలు… ప్రేమతో నిండిన జీవితం…
ఈ జంట వివాహ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సింపుల్‌గా, ఎలిగెంట్‌గా జరిగిన ఈ వేడుకలో సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ అందరి దృష్టి ఈ జంటపైనే నిలిచింది. 💍❤️
అగ్రకథానాయిక సమంత పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లోని లింగ భైరవి దేవాలయంలో సమంత-రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. ఈ వేడుకలో సమంత ఎర్రచీరలో, రాజ్ క్రీమ్-గోల్డ్ కలర్ కుర్తాతో అందంగా కనిపించారు. సమంత ఈ ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వివాహం భూత శుద్ధి పద్ధతిలో జరిగింది. ఈశా ఫౌండేషన్ తెలిపిన ప్రకారం, ఈ ‘భూత శుద్ధి వివాహం’ దంపతుల మధ్య లోతైన బంధాన్ని, సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రూపొందించబడిన ప్రత్యేకమైన ప్రక్రియ. కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో లింగ భైరవి ఆలయాల్లో లేదా ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ విధానం ద్వారా వధూవరుల దేహంలోని పంచభూతాలను శుద్ధి చేస్తారు, దేవి అనుగ్రహం దంపతుల దాంపత్య జీవితం వెలిగించేలా ఉంటుందని ఫౌండేషన్ వివరించింది.
గతంలో సమంత-రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. రాజ్-డీకే సంయుక్తంగా రూపొందించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ ప్రాజెక్ట్‌ల కోసం పని చేయగా వీరి మధ్య స్నేహం ఏర్పడింది. సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రంలో రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫొటోలు షేర్ చేసిన తర్వాత నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇటీవల సమంత తన జీవితంలో జరిగిన మార్పుల గురించి పోస్ట్ పెట్టారు. ఆమె పేర్కొన్నారు:
“ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరలో నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేసాను. రిస్క్ తీసుకున్నాను, ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నాను. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే.”
ఈ పోస్ట్‌తో పాటు రాజ్ నిడిమోరుతో ఉన్న ఫొటోలను షేర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
📸 మరిన్ని ఫోటోలు, డీటైల్స్ కోసం ఫాలో అవ్వండి!
























