డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి గ్రామం వద్ద సోమవారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. కళాశాల బస్సు డ్రైవర్ దందుకూరి నారాయణరాజు (65) గుండెపోటు వచ్చినప్పటికీ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును సురక్షితంగా ఆపారు. దీంతో బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. అయితే బస్సును నిలిపిన వెంటనే స్టీరింగ్‌పై కూలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన త్యాగం విద్యార్థుల ప్రాణాలను కాపాడింది.



















