నేను ఎన్ని మందిని చంపానో గుర్తు లేదు… వాళ్లు మంచివారా చెడ్డవాళ్లా అన్నది కూడా అడగలేదు. కానీ వారి కళ్లలో కనిపించిన భయం మాత్రం నాకు ఇప్పటికీ గుర్తుంది… దానికి నేనే కారణం’’ — అంటున్నారు బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్. ఆయన ఈ మాటల వెనక ఉన్న అర్థం తెలుసుకోవాలంటే రాబోయే ‘కింగ్’ సినిమాను చూడాల్సిందే.
షారుక్ ప్రధాన పాత్రలో సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం, ‘పఠాన్’ తరువాత వీరిద్దరి కలయికలో వస్తోన్న మరో స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్. ఆదివారం షారుక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటిస్తూ గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ వీడియోలో షారుక్ పవర్‌ఫుల్ లుక్‌తో, యాక్షన్ సీక్వెన్స్‌లతో ఆకట్టుకున్నారు. ‘‘ప్రపంచం నాకు ఒక పేరు ఇచ్చింది… అదే ‘కింగ్’, నేను భయం కాదు… విధ్వంసం’’ అనే డైలాగ్‌లతో వీడియో అంతా ఉత్కంఠను రేపుతోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.




















