“చినబాబు చిరు తిండి… 25 లక్షలండి” అనే శీర్షికతో సాక్షి పత్రిక తనను ఉద్దేశించి ప్రచురించిన తప్పుడు కథనాలపై గత ఆరు సంవత్సరాలుగా ఆ పత్రికకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నానని తెలిపారు. నిజానికి విరుద్ధంగా, ఆధారాలు లేని రాతలను ప్రచురించడం సరికాదని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలు రాసే ఏ పత్రికనైనా సహించబోమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలపై న్యాయపరంగా పోరాడుతూనే ఉంటానని ఆయన పేర్కొన్నారు.


















