శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల తొమ్మిదో రోజు మంగళవారం శ్రీ భ్రమరాంబాదేవి సిద్ధిదాయిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీస్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కైలాస వాహనంపై అధిష్ఠింపజేసి అర్చకులు, వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. కళాకారుల సందడి నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు శ్రీశైల పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
















