స్వయంభూ సినిమా కేవలం ఒక కథ కాదు, రెండేళ్ల కృషి, పదుల సంఖ్యలో సెట్లు, వేల సవాళ్లతో కూడిన ఒక సామ్రాజ్యం. ఈ సినిమా నిర్మాతలు భువన్ & శ్రీకర్ నమ్మకంతో కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ చారిత్రక వీరుడి గాథ మన భారతదేశ చరిత్రకు పునాదులైన గొప్ప వీరుడి కథను ఆవిష్కరిస్తుంది. ఈ సినిమా 170 రోజుల షూటింగ్ను పూర్తి చేసుకుంది. నటుడు నిఖిల్ సిద్ధార్థ్, తన గుర్రం మారుతితో పాటు ఈ భారీ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్ర పోషించారు. ఈ చిత్రానికి రవీందర్ గారు, ప్రభాహరన్ గారు అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్ అందించగా, కె.కె. సెంథిల్ గారు తమ సినిమాటోగ్రఫీతో ఈ ప్రపంచాన్ని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లారు. మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ తన సంగీతంతో ఈ మాయాజాలానికి జయగర్జన అందించగా, నేషనల్ అవార్డ్ గ్రహీత సొలోమన్ మాస్టర్ ఫైట్స్ కొరియోగ్రఫీ చేశారు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ బాధ్యతలను భరత్ కృష్ణమాచారి వహించారు. భారతదేశ చరిత్ర మరియు కీర్తిని చాటిచెప్పే ఈ ఎపిక్ టేల్, మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఫిబ్రవరి 13, 2026న థియేటర్లలో విడుదల కానుంది.




















