అస్తమానూ పిజ్జా, బర్గర్ అంటూ జంక్‌ఫుడ్ అడిగే అల్లరి పిడుగులకు ఇంట్లోనే ఈ హెల్దీ పిజ్జా చేసిపెట్టండి. ఎంచక్కా ఎంజాయ్ చేస్తారు, మళ్లీ మళ్లీ చేయమని అడుగుతారు!
కావాల్సినవి: చిలగడదుంపలు – 2, మొక్కజొన్న గింజలు – పావుకప్పు, జొన్నపిండి లేదా వేరే ఏదైనా పిండి -పావుకప్పు, మిరియాల పొడి – చెంచా, కొత్తిమీర – కొద్దిగా, చీజ్ – 4 చెంచాలు, నూనె – తగినంత, చిల్లి ఫ్లేక్స్ – కొద్దిగా.
తయారీ: చిలగడదుంపలను చెక్కు తీసి తురమాలి. అందులో జొన్నపిండి, మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని కాస్త గట్టి మిశ్రమంలా కలపాలి. తరవాత ఒక పాన్ పెట్టి వేడయ్యాక నూనె రాసి కలిపిపెట్టిన మిశ్రమాన్ని పిజ్జా ఆకారంలో లేదా నచ్చిన ఆకారంలో వేసి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి.
చిన్నారి పొట్టకోసం
ఇంకోవైపు తిప్పుకొని, పైన ఉడికించిన మొక్కజొన్న గింజలు, చీజ్, చిల్లి ఫ్లేక్స్, కొత్తిమీర వేసి మూతపెట్టి, చీజ్ కరిగే వరకు సన్నని సెగపై ఉడికించాలి. అంతే, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన పిజ్జా సిద్ధమైపోతుంది.




















